Categories
బరువు తగ్గాలనుకునే వారికీ సాబుదానా మంచి ఆహారం అంటారు ఫుడ్ ఎక్సపర్ట్స్ . ఈ సగ్గు బియ్యంలో పిండి పదార్దాలు,ఖనిజాలు విటమిన్లు అధికం. కొవ్వులొ సోడియం చాలా తక్కువ. వీటిలో మాంసకృత్తులు ఎక్కువే . వీటితో చేసిన కిచిడీతో కొన్ని గంటల పాటు ఆకలి ఉండదు. ఇవి ఎముకలు దృడంగా చేస్తాయి నరాల నొప్పులు తగ్గుతాయి. స్టార్ట్ శాతం ఎక్కువే,కృత్రిమ తీపి లేకపోవటం వల్ల పాల తర్వాత చిన్న పిల్లలకు తినపించవలసిన ఆహారం ఇది. తక్షణ శక్తి ఇవ్వగలదు. సగ్గుబియ్యం పాలతో ఉడికించి పంచదార కలిపినా పాయసంగా తీసికుంటే శరీరానికి ఎంతో చల్లదనం ఇస్తుంది. వంద గ్రాముల సగ్గుబియ్యంతో 355 క్యాలరీలు 94 శాతం కార్బోహైడ్రేట్స్ ఫ్యాటీ ప్రోటీన్స్ ఉంటాయి.