Categories
శివ శివ శంకరా!!భక్తవ శంకర
శంభో హర హర!!
నారీమణులూ!! ఈ రోజు ముందుగా నిన్నటి వాల్మీకి మహర్షి జయంతిని తలచుకుంటూ కొమరవెల్లి మల్లన్న క్షేత్రాన్ని చూసి తరించి వద్దాం రండి!!
హైదరాబాద్- కరీంనగర్ రహదారి లో కనిపించే సుందరమైన స్వాగత తోరణాలు మనల్ని ఆహ్వానిస్తాయి.నల్ల పాలరాతితో శివలింగం దర్శన భాగ్యం కలుగుతుంది.ఈ క్షేత్రంలో ధ్వజస్థంబంని గమనిస్తే దేవతలే రూపకల్పన చేసినట్టు కనిపిస్తుంది.
ఈ క్షేత్రంలో మూడు నెలలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. చూడడానికి రెండు కళ్ళూ చాలవు.శివసత్తుల నృత్యాలు వీనులవిందుగా తిలకించవచ్చు.
నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాలతో అభిషేకం,పండ్లు.
-తోలేటి వెంకట శిరీష .