Categories

అనూ అగర్వాల్ బాలీవుడ్ నటి . ఆషికే అన్నా సినిమాలు నటించింది . మోడలింగ్ కోసం ముంబయ్ లో అడుగు పెట్టిన అను అగర్వాల్ అనుకోకుండా నటి అయిందన్న మాట . ఆమె కు ఒక మూడ్ లో బతకటం నచ్చలేదు . ఒక ఆశ్రమంలో చేరేందుకు వెళ్ళిపోయింది . అంతలో ఒక యాక్సిడెంట్ జరిగి ఆమె శరీరం చిద్రమైంది . 29 రోజులు కోమాలో గడపాల్సి వచ్చింది . మళ్ళీ తనకు చాలా ఇష్టమైన యోగా తో ఆరోగ్యాన్ని సాధించుకొంది . ఇప్పుడు పేదపిల్లలకు యోగా నేర్పుతుంది . అనుజువల్ పుస్తకం చాలా పాపులర్ . బాల్యం నుంచి భాయ్ ఫ్రెండ్ దాకా దాపరికం లేకుండా రాసిన ఈ అనుభవాల పరంపరల రచన అనూ అగర్వాల్ కు చాల పేరు తెచ్చింది .