“యలమి కోరిన వరాలిచ్చే దేవుడే..
వాడు అలమేల్మంగ వేంకటాద్రినాథుడే..
వేడుకుందామ..వేడుకుందామ వెంకటగిరి
వెంకటేశ్వరుని వేడుకుందామ…”!!

సఖులూ నిత్య ప్రసాదం కి …సిద్ధమా?
మరి పదండి అప్పన్నపల్లి బాల బాలాజీని పూజించి ప్రసాదం తయారు చేసుకుందాం.   గోదావరి నది తీరాన కొలువై ఉన్నాడు.  చిన్ని విష్ణు మూర్తి అందుకే బాల బాలాజీ అని పేరు. పూర్వం వీరాస్వామి అనే భక్తుడు తన వ్యాపారంలో వచ్చే ఆదాయం నుంచి స్వామి వారికి సగం సమర్పించేవాడు.అతని కల్మషం లేని భక్తికి ప్రీతిపాత్రుడై వీరాస్వామి కలలో కనిపించి గోదావరి దగ్గర ఉన్న గౌతమి నది తీరాన వెలుస్తాను అని చెప్పి నిష్క్రమించారు  ఆ గౌతమి నదిని ఇప్పుడు వైతరణి అని అక్కడ తర్పణాలు ఒదిలితే మోక్షం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం.  కోరిన కోరికలు తీర్చే స్వరూపం మన బాల బాలాజీ.తప్పక చూడవలసిన క్షేత్రం.

ఇష్టమైన పూలు:అన్ని రకాలైన పూలతో అలంకారం చేసుకుంటాడు.

ఇష్టమైన పూజ:శ్రీ దేవి భూదేవి సహితుడైన బాల బాలాజీ అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటాడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,తేనె, అన్ని రకాల పండ్లు. పుట్ట తేనె తో అభిషేకించండి స్వామి మన ఎదురుగా వచ్చి నిలబడతాడు.
తనివితీరా స్వామిని దర్శించి పావనమవుదామా!!

      -తోలేటి వెంకట శిరీష

Leave a comment