ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారని ఒంటరి తనాన్ని దూరం చేసే శక్తి నవ్వులో ఉంటుందనీ అంటారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా వ్యక్తులు రోజులో 13 సార్లు నవ్వుతారు. చిన్న పిల్లలు పెద్దల కన్న మూడు రెట్లు ఎక్కువ నవ్వుతారు. 15 నిమిషాల పాటు నవ్వితే 40 కేలరీలు ఖర్చు అవుతాయి. అలాగే నవ్వటం వల్ల ముఖంలో 53 కండరాలు కదిలి మంచి వ్యాయామం అవుతుంది. నవ్వటం వల్ల శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ వత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నవ్వు ఒక చికిత్సా సాధనంగా చూస్తున్నారు అందుకే హాస్పటల్స్ కు అనుబంధంగా నవ్వుల హస్పటల్స్ వెలుస్తున్నాయి. ఇక్కడ హాస్వ ప్రధానమైన చిత్రాలు విడియోలు చూపిస్తారు. అంచేత ఇన్ని సుగుణాలున్న అందబైన నవ్వులను ఎలాగైనా అలవాటు చేసుకొని నవ్వుతూ ఉండాలంటారు ఎక్స్ పర్ట్స్.
Categories