దంగల్ సినిమాలో పాత్ర కోసం నా జుట్టు కత్తిరించుకున్నాను . ఇప్పుడు హ్యూమన్ కంప్యూటర్ చిత్రం లోని అనుపమ బెనర్జీ పాత్ర కోసం మరొక మారు జుట్టు కట్ చేసుకోవలసి వచ్చింది. ఇలా చేసే పాత్రల కోసం ప్రతిసారి మారిపోవటం నాకెంతో ఆనందంగా వుంటుంది అంటోంది సాన్య మల్హోత్రా…. ప్రతి సారి నా పాత్ర కోసం వారి వారి రూపంలో మారిపోవటం నాకు స్ఫూర్తిగా అనిపిస్తోంది. నేను బాగా నటించగలను అని నాకు నాపైన నమ్మకం వస్తుంది అంటోంది సాన్య . దంగల్ సినిమాలో నటించిన సాన్య మల్హోత్రా శకుంతలా దేవి హ్యూమన్ కంప్యూటర్ లో విద్యాబాలన్ కుమార్తెగా నటిస్తోంది.

Leave a comment