Categories
కొన్ని పండ్ల, కూరగాయలకు శరీరంలోని వ్యర్ధాలను తొలిగించే శక్తి వుంటుంది. సి-విటమిన్ అధికంగా వుండే నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి తాగితే వ్యర్ధాలు బయటికి పోతాయి. పుచ్చకాయలో సిట్రోలినిక్ అనే ప్రత్యేక పదార్థం కాలేయం,మూత్ర పిండాలు అమోనియా బారిన పడకుండా చేస్తాయి. నేరేడులోని యాంటీ బయోటిక్ గుణాలు మూత్రాశయం లో వ్యర్దాలు పేరుకోకుండా చేస్తాయి. యాపిల్ లోని పెక్టన్ పేగుల్లోని మలినాలనీ వ్యర్దాలని బయటికి నెట్టేస్తుంది. కిర ముక్కలు వేసిన నీటిని తాగినా మంచిదే బొప్పాయి శరీరంలోని వేరువేరు అవయవలోని వ్యర్దాలని బయటకి నెట్టేసి జీర్ణ శక్తిని,వ్యాధినిరోధక శక్తిని పెంచుతోంది.