కొన్ని చిన్న చిట్కాలతో వంటింటి పనులు తేలిగ్గా చేసేయచ్చు . మిక్సీ వాడుకొన్నాక ,అందులో డిష్ వాష్ డ్ లిక్విడ్ ,కొన్ని నీళ్ళుపోసి ఒక్కసారి గ్రయిండ్ చేస్తే బ్లెడ్ కింద ఉన్న మిగిలు పదార్ధం కూడా బయటికి వచ్చి ,మిక్సీ శుభ్రంగా ఉంటుంది . డెటాల్ వేసిన నీళ్ళలో గుడ్డను ముంచి కిచెన్ గట్టు శుభ్రంగా తుడిస్తే బొద్దింకలు పురుగులు చేరకుండా ఉంటాయి . డెట్టాల్ నీళ్ళు లేదా వంట సోడా వేడినీళ్ళు వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని సింకులో పోస్తే సింక్ బ్లాక్ అవకుండా ఉంటుంది . తప్పకుండా సింక్ లో నాఫ్తలిన్ బాల్స్ వేయాలి . గిన్నెలు తోమిన తరువాత,ఆ స్టీల్ స్క్రబ్,లేదా స్పాంజీలను వంటసోడా వేసిన వేడినీళ్ళలో ఓ నిముషం ఉంచి కడిగితే వాటిలో బాక్టీరియా పోతుంది .

Leave a comment