మనషుల్ని చూసి ,వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ గురించి ఒక అంచనకు రాకుడదు.నా మాటుకు ఎంత మోడ్రన్ గా ఉంటానో మీకు కనబడుతూనే ఉంటుంది. కానీ నా భావాలన్నీ సంప్రాదాయ బద్దంగా ఉంటాయి అంటోంది పూజాహెగ్డే. ప్రభాస్ తో ఒక చిత్రంలో నటిస్తోంది పూజా.నేను ఇవ్వాల్టి తరం అమ్మాయిని.వాళ్లు ఎలా ఆలోచిస్తారో ,ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళుకు ఎలాంటి అభిరుచులు ఉంటాయో నాకు అంతే .కానీ నాతో రెండు రోజులు ప్రయాణం చేయండి మీరు ఆశ్చర్యపోతారు. నేను ఆధ్యాత్మికంగా కనబడుతూ ఎంత సంప్రదాయకంగా ఆలోచిస్తానో అర్థం అవుతుంది. అందుకే నేనేమంటానంటే మనిషిని చూడగానే ఒక అంచనాకు రావద్దు. కాస్త గమనించి ,అర్థం చేసుకొని ఆ తర్వాత వాళ్ళ గురించి ఒక అభిప్రాయం స్థిరపరుచుకొండి అంటోంది పూజాహెగ్డే. నిజమే కదా చూసి చూడగానే వీళ్ళు ఫలానా ఇంతే అని నిర్ణయాలు తీసుకోవటం తప్పే కదా!.

Leave a comment