Categories

మేకప్ తో బుగ్గలు మెరిసేలా హై లైటర్ వాడతారు . అయితే ఈ హై లైటర్ తో కళ్ళు ,పెదవులు ,ముక్కు కూడా హై లైటర్ తో చక్కగా కనిపించేలా చేయచ్చు అంటున్నారు మేకప్ ఎక్స్ పర్డ్స్ . ఐ షాడో బ్రష్ పైన కొద్దిగా హై లైటర్ అడ్డుకొని పై పెదవి అంచుపైన గీతాలా గీస్తే పెదవులు మెరుస్తాయి . మ్యాటీ ఫైయింగ్ పౌడర్ హై లైటర్ ను ముక్కు వెంబడి రాస్తే ముక్కు చిన్నగా అందంగా ఉంటుంది . కొద్దిగా బాడీ లోషన్ తీసుకోని అందులో పొడి రూపంలో ఉన్నా హై లైటర్ ను చక్కగా కలిపితే బాడీ హై లైటర్ తయారవుతుంది . ఇది రాసుకొంటే చర్మం కాంతిగా ఉంటుంది .