Categories
పుదీనా ఆకులు సువాసన భరితం . రుచికోసం కూరల్లో వాడతారు . వంటకాల్లో అలంకరణకు ఉపయోగిస్తారు . వీటి ఉపయోగాలు అంతకంటే అధికం . ఈ ఆకుల్లో ఔషధగుణాలు చాలా ఎక్కువ అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పుదీనాలో యాంటీ ఇన్ ప్లేమేటర్,యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువ . ఇవి రకరకాల ఇన్ఫెక్షన్లు ,నొప్పుల నుంచి కాపాడతాయి . జలుబు,దగ్గుకు పుదీనా ఆకులు వేసి మరిగించిన నీటితో ఆవిరి పడితే ముక్కు గొంతు శుభ్ర పడతాయి . నెలసరి నొప్పులను పుదీనా నివారిస్తుంది . గర్భిణీలకు ఉదయం వేళ ఎదురయ్యే బడలిక నూ అసౌకర్యాన్ని నివారించడంలో పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది .