గ్రామీణ తమిళనాడు లో స్త్రీల ఉపాధి కోసం ఒక కొత్త ద్వారం తెరుచుకొంది. ఇప్పటి వరకు మగవాళ్లకే పరిమితంగా ఉన్న వాల్ పెయింటింగ్ లో జపాన్ పెయింట్ సంస్థ నిప్పన్ అక్కడ 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వారంతా విజయవంతంగా పని చేస్తున్నారు. తాజాగా నిప్పన్ సంస్థ చెన్నయ్ లో రెండు వేల మంది మహిళా పెయింటర్ లకు శిక్షణ ఇవ్వాలనుకొంది. చెన్నయ్ రోటరీ క్లబ్ లో చేసుకున్న ఒడంబడిక  ప్రకారం,పెయింటింగ్ పట్ల ఆసక్తి ఉన్న మహిళలను రోటరీ క్లబ్ గుర్తించింది. వాల్ పెయింటింగ్ లో శిక్షణ పొందాక వారిని ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ లకు,కంస్ట్రక్షన్ సంస్థ లకు వారిని అనుసంధానం చేస్తాం అంటున్నారు నిప్పన్ సంస్థ ప్రతినిధులు.

Leave a comment