పిరమిడ్ల పైన గాలిలో తేలే అవకాశం కల్పించారు ఈజిప్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వశాఖ. ఇది ఈజిప్ట్ పారా బోటింగ్ ఎయిర్ స్పోర్ట్స్ ఫెడరేషన్ సహకారంతో ఈజిప్ట్ స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్కై డ్రైవ్ ఈవెంట్ నిర్వహించింది. ‘జంప్ లైక్ ఎఫెరో’ పేరునా ఈజిప్ట్ లో జరిగిన ఈ స్కై డ్రైవింగ్ కార్యక్రమంలో 20 దేశాల నుంచి 200 మంది స్కై డ్రైవర్లు పాల్గొన్నారు ప్రాచీన వింతల్లో ఉన్న ఏడు పిరమిడ్ల పైన గాల్లో తేలుతూ కిందకు దిగటం ఒక గొప్ప అనుభవం అన్నారు డ్రైవర్లు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్కై డ్రైవర్లు ఎంతోమంది ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు.

Leave a comment