Categories
పిల్లల చేత రైటింగ్ ప్రాక్టీస్ చేయించండి . దానివల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏడాది మొత్తం కష్టపడి చదివిన వాళ్ళు ఒక్కసారి పరీక్షలు బాగా రాయలేక పోతారు . ఆలా రాయలేక పోయేందుకు ఎనో కారణాలు ఉంటాయి . పరీక్షల భయం ఒకటి కావచ్చు . స్పీడ్ గా రాయలేక పోవటం ఇంకోటి కావచ్చు . అందుకే ప్రతిరోజు చదవటంతో పాటు రాయటం ప్రాక్టీస్ చేయించాలి . ఒక్కసారి రాయటం అంటే పదిసార్లు చదవటంతో సమానం అన్నమాట రాసిన విషయాలు మనస్సులో నిలిచిపోయి బాగా జ్ఞాపకం ఉంటాయి . పిల్లల్లో రాయగలమన్న విశ్వాసం ఏర్పడుతుంది ప్రాక్టీస్ కారణంగా ఏకబిగిన రెండు మూడు గంటలు తిన్నగా కూర్చుని రాయగలుగుతారు .