Categories
ఏ పద్దతి ఎంచుకొన్నా ఒక అందమైన కళా సృష్టి జరగటం ముఖ్యం కుటుంబ పోషణ కోసం కుట్టుమిషన్ తో బట్టలు కుట్టటం ఎంచుకొన్నా అరుణ కుమార్ బాజాజ్ కి తృప్తి కలగలేదు . కళారూపాల తయారీ కూడా ఎంచుకున్నాడు . మిషన్ పనే రంగురంగుల దారాలతో జీవం ఉట్టిపడే బొమ్మలు కుట్టటం ప్రాక్టీస్ చేశాడు . అందమైన బొమ్మల్ని దారాలతో సృష్టించ గలిగాడు . ఇప్పటి వరకు 250 పైగా బొమ్మలు వస్త్రాలపై కొట్టాడు . బొమ్మ సైజ్ ను బట్టి 15 నుంచి 6 నెలలు పడుతుంది . దేశ విదేశాల్లో 64 రోమలు లక్షలు పెట్టి ఇతని బొమ్మలు కొంటారు . ఒక్కో శ్రీకృష్ణుడి చిత్రం కుట్టేందుకు ఆరునెలలు పట్టిందిట . ఈ చిత్రం ధర కోటి రూపాయి ల వరకు పలుకుతోందని అంచనా వేస్తున్నాడు అరుణ్ . ఇతన్ని ముద్దుగా నీడిల్ మాన్ అని పిలుస్తారు .