Categories

పాత బస్ లను మోడ్రన్ టాయ్ లెట్స్ గా మార్చేసి మహిళల అవసరాలు తీరుస్తున్నారు పూణే కు చెందిన ఉల్కా సదల్కర్ . పుణేలో జనసాంద్రత ఎక్కువ.పబ్లిక్ టాయిలెట్స్ పరిమితంగా ఉన్నాయి పైగా వాటిని ఉపయోగించే మహిళల సంఖ్య చాలా తక్కువ. దానితో పాత బసు లను ఆధునిక టాయిలెట్ లుగా మార్చారు ఉల్కా పూణే మున్సిపాలిటీ తో చర్చించి పాత బస్ లలో వెస్ట్రన్ టాయిలెట్ ఇండియన్ టాయిలెట్,శానిటరీ నాప్ కిన్స్ వంటివి అన్నింటిని ఏర్పాటు చేశారు. ఐదు రూపాయిలతో వీటిని వాడు కోవచ్చు. చాలా త్వరలో మురికివాడల్లో నివసించే వారిని ఈ బస్ లకు దగ్గర చేసే పనిలో ఉన్నాం అంటోంది ఉల్కా.