అందమైన అలంకరణ వస్తువులున్నా ఇంటికి లైటింగ్ మరింత అందం ఇస్తుంది అంటారు ఎక్స్ పర్డ్స్ . లైటింగ్ ఎంత బావుంటే వస్తువులు అంత విలువగా కనిపిస్తాయి . లివింగ్ రూమ్ లో లైటింగ్ ఎక్కువ అవసరం ఉండదు . చదువుకొనేది ,టి వి చూసేది ఇక్కడ . గదిమూలల్లో గోడల పైన పెయింటింగ్స్ ,ఫోటోల పైన,సోఫాలు ,కూర్చునే ప్రాంతంలో చక్కగా వెలుతురు పడాలి ,అలాగే బెడ్ రూమ్ లైట్స్ మూడ్ మార్చేవిగా ఉండాలి . గదిలోకి వెళ్ళగానే వేసే లైట్ తో పడకగది లోని సామాగ్రి మొత్తం కనిపించేలా ఉండాలి . ఎక్కువ కాంతినిచ్చే లైట్లు వాడకూడదు . అందమైన రంగు దీపాలు ముఖ్యంగా ఎరుపు ,ఆకుపచ్చ ,నారింజ రంగుల షేడ్స్ బావుంటాయి . వంటగది లో మెరుగైన కాంతి కావాలి . వంటచేసి భాగం పైన లైటింగ్ పడాలి . కూరగాయల తరిగే చోట పని చేసే భాగం పైన చక్కగా వెలుగు పడాలి . పై నుంచి వేలాడే లైట్లు ఉంటే అనువుగా ఉంటుంది . వంటగది కప్ బోర్డులు ఆకర్షనీయమైన వంట పాత్రలో కనబడే విధానంగా లైటింగ్ ఉండాలి . ఇక బాత్ రూమ్ వెలుతురు బావుండాలి . బాత్ రూమ్ ఉండే గాలిలో తేమ అధికం . అది అద్ధం పైన పేరుకుంటూ ఉంటుంది అక్కడ అమర్చే లైట్ తేమను తోలగించే శక్తి కలదిగా ఉండాలి . బాత్ రూమ్ చీకటిగా ఉండకూడదు . అన్ని మూలాలు సవ్యంగా కనిపించేలా మంచి వెలుగు ఉంటె లైటు తప్పనిసరిగా ఉండాలి . ఇక ఇంటిబయట మరింత స్పష్టంగా కనిపించే వెలుగుండాలి . లాన్ లో టేబుళ్ళు ,కుర్చీలు ఉండే చోట భూమి నుంచి పైకి వెలుగునిచ్చే అలంకారణ ఉండాలి . వరండాలో రంగుల అడ్డలున్నా దీపాలుండాలి . సౌకర్యం అందం దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ప్రతిచోట లైట్లు ఏర్పాటు చేసుకోవాలి .
Categories