టీ రుచి ఎప్పుడు అద్భుతం. ఈ తేయాకు తోటల పెంపకానికి నిలయం అస్సాం. ఇప్పుడు వస్తున్న కొత్త తరం టీ తయారీ పైన ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త రుచులు సృష్టిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్ టీ,గ్రీన్ టీ,వైట్ టీ ఊలాంగ్ టీ ఇవన్నీ ఒక జాతి మొక్క నుంచి తయారయ్యేవే అయినా అవి పెరిగిన ప్రదేశం ఎలా కోశారు అన్న దాని పైన రుచి ఆధారపడి వుంటుంది. టీ లీఫ్ ప్రాసెసింగ్ పద్దతి పైన చిక్కదనం,రంగు,వస్తాయి. ఈ టీ తయారీ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బొంగు తేయాకు పానీయం తయారు చేస్తారు. వెదురు బొంగులో పల టీ ఆకులు దట్టంగా నూరి కలుస్తారు. ఈ కాల్చిన ఆకులు పదేళ్ళపాటు నిలవుంటాయి. ఇది ప్రత్యేకమైన బ్లాక్ టీ కోసం వాడుతారు. ఇందులో చెక్కర తేనె కలపకుండా స్థానిక ఫలాల నుంచి తీసిన తీపి పదార్ధాన్ని కలుపుకుంటారు మేఘాలయాలో కూడా బ్లాక్ టీ తయారు చేస్తారు. రుచి గాఢత భిన్నంగా ఉంటాయి. ఇందులో పాలు,చెక్కర కలుపుతారు. ఊలాంగ్ టీ కూడా మేఘాలయాలో దొరికేదే. నారింజ రుచి తో వుండే ఈ టీ మొక్కలు సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తున పెరుగుతాయి. ఆలివ్ గ్రీన్ ఎల్లో రంగుల మిశ్రమం లో ఉంటుంది ఈ టీ. అలాగే బాక్టీరియా వైరస్ లకు విరుగుడుగా జింజర్ టీ పొడి తయారు చేస్తున్నారు. ఇది ఇంతక ముందు సంప్రదాయంగా ఇళ్ళలో చేసుకొనే టీ. ఇప్పుడు వ్యాపార పరంగా తయారవుతోంది,టీ ని ఆరోగ్యం పెంచే పానీయంగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు కొత్త తరం టీ ఎస్టేట్ దారులు. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే వైట్ టీ కాఫీ రుచి కి దగ్గరగా ఉండే ఊలాంగ్ టీ ఇప్పుడు టీ ప్రియుల లిస్ట్ లో మొదట వరుసలో ఉన్నాయి.

ReplyForward

Leave a comment