Categories
ఇంత మంచి కోరిక కోరింది గనుకనే జనం మెచ్చేసి అభినందనలు కురిపించారు. కేరళకు చెందిన పెళ్ళికూతురు అజ్న్ నజీమ్,ఇజస్ హకీం ని వివాహం చేసుకొంది. పెళ్ళికొడుకు ఎదురు కట్నంగా ఏదైనా కోరుకోమన్నాడు నగలో,నాణ్యలో,విహార యాత్ర లో అడుగుతోంది అనుకోని చూస్తుంటే 100 పుస్తకాలు కానుకగా అడిగింది,పైగా ఆ లిస్ట్ లో భగవద్ గీత ఖురాన్ బైబిల్ కాన్ స్టి ట్యూషన్ ఆఫ్ ఇండియా వగైరాలున్నాయి. ఈ కోరిక కాస్త వైరల్ అయి ఆమె అభిరుచిని అందరు మెచ్చుకొంటున్నారు. వందశాతం అక్షరాస్యత సాధించిన కేరళ లో పుట్టిన అమ్మాయి ఇలాటి కోరిక కోరిందంటే ఆశ్చర్యం ఏముందీ.