Categories
విషాద సంగీతం వినేందుకు బావుంటుంది గానీ దాని ప్రభావం కూడా అంత విషాదంగానే ఉంటుందని చెపుతున్నారు అధ్యయన కారులు. మంచి మూడ్ కోసం ఇష్టం గానో,లేదా విసుగ్గ,చిరాగ్గా ఉన్న మంచి సంగీతం వింటూ ఉంటారు చాలామంది కానీ విషాదంగా ఉన్న పాటలు మన మనసులో ఉండే విషాదాన్ని తట్టి లేపి తెలియని దిగులుకు గురి చేస్తాయి అంటున్నారు అధ్యయన కారులు. విషాద సంగీతం మనసుని మరింత సున్నితత్వానికి గురిచేసి భావోద్రేకాల ప్రభావాన్ని పెంచుతోంది. జీవితంలో ఎదురైనా చేదు స్మృతులను తెలియకుండానే స్పృరణకు తెచ్చే విషాదాన్ని కలుగజేస్తాయి. కనుక పాట సంగీతం,భావాలు బావున్నాయి కదా అని విషాద గీతాలు వింటూ వుంటే ఆ తర్వాత దాని ప్రభావం నుంచి ఒక పట్టాన బయటపడటం కష్టమే అంటున్నారు ఎక్సపర్ట్స్.