ఈ శీతాకాలంలో అల్లం తో ఒక లేహ్యం చేసుకొని ప్రతి రోజు తీసుకోండి ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. అల్లానికి ఆకలిని జీర్ణ శక్తి పెంచే గుణాలున్నాయి. పావు కిలో అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి వీటిని నూనెలో వేయించి ముద్దగా చేసుకోవాలి. పావు కిలో పటిక బెల్లం నూరి కొంచెం నీరు చేర్చి ఉండలా అయ్యే వరకు మరిగించాలి ఇందులో కాస్త శొంఠిపొడి,పిప్పళ్ళ పొడి ధనియాల పొడి చేర్చి ముద్దగా చేసుకొన్న అల్లం వేసి ఉడకనివ్వాలి. మిశ్రమం అంటు కోకుండా వచ్చే వరకు  పొయ్యి పైన తిప్పుతూ ఉండి ,తరువాత ఆ దాన్ని పళ్ళెంలో పోసి చల్లార నిచ్చి. ముక్కలుగా చేసి సీసాలో భద్ర పరుచుకొని రోజు ఒక ముక్కతింటే చాలా మంచిది.

Leave a comment