Categories
అవసరానికి మించి ఆహారం తీసుకొన్న ఎక్కువ సేపు కూర్చొని ఉన్న. వ్యాయమం చేయకపోయినా పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోతుంది. మొత్తం శరీరం సరైన తీరులో ఉండి,పొత్తి,కడుపు మాత్రం లావుగా వుంటే దానికి జీవన విధానమే కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సరైన వ్యాయామం లేకపోతే పొట్ట చుట్టు కండరాలు పట్టు తప్పి కొవ్వు పేరుకు పోతుంది. వైద్యుల సాయంతో సమస్య కారణం తెలిసుకొని వ్యాయమం చేయాలి. ఆహారం లో మంచి కొవ్వులు ఉండేలా బాదం,పిస్తా,ఆక్రూట్ లు,పీచు పదార్ధాలు ఎక్కువగా వుండే పప్పులు,చిరుధాన్యాలు కాయగూరలు ఆకుకూరలు మొదలైనవి తీసుకోవాలి. ఉద్యోగ రీత్యా కూర్చోవలసి వచ్చిన ప్రతి గంటకు కనీసం నాలుగైదు నిముషాలు లేచి తిరుగుతూ ఉండాలి.