తన చిన్నారి కూతురి కోసం ఫర్వీన్ చేసిన సాహసాన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది . మహిళల పట్ల కఠినమైన ఆంక్షలున్న పాకిస్థాన్ లో ఒక మహిళ అడుగు బయట పెట్టటం . అదీ పురుషుని వేషంలో ఒక షాప్ నడపటం ,క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తటం మామలు విషయం కాదు . లహొర్ కు చెందిన ఫర్వీన్,ఇంట్లో ఇష్టంలేని పెళ్ళి చేసుకొంది . గర్భవతి అయ్యాక ఆ భర్త కూడా వదిలి పెట్టాడు . ఆ చదువు చిన్న బిడ్డతో ఒంటరిగా బతకటం పురుషుల దాష్టీకాలు భరించటం ఆమెవల్ల కాలేదు . అందుకే మగవాడిగా వేషం మార్చుకొంది హెయిర్ కట్ చేసుకొని టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ తో లాహోర్ లోని అనార్కలీ బజార్ లో సొంతంగా ఒక షాపు నిర్వహిస్తోంది . టాక్సీ నడుపుతోంది . ఈ కష్టం గాధ ఒక ఆన్ లైన్ ఇంటర్యూలో ప్రపంచానికి తెలిసింది . ఇప్పుడామెకు ఎన్నో సాయాలు అందుతున్నాయి . విరాళంగా కొన్ని లక్షల డబ్బుకూడా అందింది .