Categories
శిశువులూ ,పశువులూ కూడా సంగీతం ఇష్టపడతాయి అన్నారు ప్రాచీనులు. ఇప్పుడు ఆధునిక పరిశోధనలు ఈ వరసలో మొక్కల్ని కూడా చేర్చింది. ఎరువులు,రసాయనాల్లాగే సంగీతం కూడా మొక్కలకు బలం ఇస్తుంది అంటున్నారు. అమెరికా వంటి ఎన్నో దేశాల్లో మ్యూజిక్ థెరపీ లతో అధిక దిగుబడి సాధిస్తున్నారు. చక్కని శ్రావ్యమైన సంగీతం వినిపిస్తారు. హడావుడిగా ఉండే ఫాస్ట్ బీట్ కంటే లలితమైన గీతాలు మొక్కలకు కూడా సంగీతాన్ని గ్రహించే శక్తి ఉంటుందంటున్నారు. పంటలకు అధికమైన రసాయనాలు జల్లితే అవి భూసారాన్ని దెబ్బతీసి,మొక్కలకు హాని కలిగిస్తాయి.అలా సొమ్మసిల్లే మొక్కలకు సంగీతం ప్రాణం పోస్తుంది అంటున్నారు.