Categories
మిలమిల మెరిసి పోయే వెండిలో బాక్టీరియా ,వైరస్ లను దగ్గరకు రానివ్వని లక్షణం ఉంది . ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పు పట్టదు . అందువల్ల ఇందులో ఆహార పదార్దాలు నిల్వ ఉంచినా ఆరోగ్యానికి ఎలాటి హానీ ఉండదు . పరిశోధకులు కూడా వెండికి రోగాలను నయం చేసే శక్తి ఉందంటున్నారు . పాత రోజుల్లో మంచి నీళ్ళు ,వైన్ ,వినిగర్ వంటివి పాడవకుండా సిల్వర్ తో చేసిన బాటిల్స్ వాడేవాళ్ళు,పాలు తాజాగా ఉండేందుకు పాల సీసాల్లో వెండి నదులు వేసేవాళ్ళు. 300ఖరీదు కనుక రోజు వారి వాడకంలో వెండి పాత్రలు వాడలేము గానీ అవకాశం ఉంటే మాత్రం వెండి వినియోగం ఎక్కువగా ఉంటేలా చూసుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ .