Categories
వ్యాయామాలు చేస్తుంటే సాదారణంగా అలసట వస్తూ ఉంటుంది . జిమ్ లో వర్క అవుట్స్ ,ట్రెడ్ మిల్ లేదా ఆరుబయట పరుగులు నడక ఏంచేస్తున్న అలసట వస్తుంది అలాటప్పుడు ఫాస్ట్ బీట్ తో సంగీతం ఎంచే గుండె వేగం పెరిగి అలసట కాస్త తక్కువగా ఉంటుందంటున్నారు అధ్యయనకారులు . సంగీతానికి భాష అక్కర్లేదు లయ ముఖ్యం . లయతో కూడిన శబ్దం జీవక్రియని ప్రభావితం చేస్తుంది అంటున్నారు . నిముషానికి 90 తరువాత 130 ,ఆ తరువాత 170 బీట్స్ వినిపించి పరిశోధన చేశారు . అత్యధికమైన బీట్ అవుట్ వ్యాయామం చేసే వాళ్ళలో అలసట చాలా తక్కువగా ఉందని కనిపెట్టారు సంగీతం నాడీ వ్యవస్థని రక్త ప్రసరణనీ నియంత్రిస్తుందనీ తద్వారా అలసట తగ్గిస్తుందని పరిశోధనలు రుజువు చేశాయి .