భారతీయ ఉపఖండంలో తొలి ఉద్యానవన స్మృతి సౌథం గా గుర్తింపు పొందింది హుమాయిన్ టూంబ్ . దీన్ని 1569 లో నిర్మించారు . హుమాయిన్ చనిపోయిన తర్వాత అయన పై తనకు ఉన్నా ప్రేమకు చిహ్నంగా ఆయన తొలి భార్య బేగం దీన్ని నిర్మించింది . ఎర్రని ఇటుక రాళ్ళతో అత్యంత సుందరంగా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకోంది బేగా బేగం. 1530లో బేగా బేగం హుమాయిన్ ల వివాహం ఆమె 19వ ఏట జరిగింది . 1539 లో ఆమె ప్రయాణంలో ఉండగా,షేక్ షా సూరీ ఆమెను బందీగా పట్టుకొన్నాడు . చరిత్రలో ఒక మొఘల్ రాణిని పట్టుకోవటం అదే తొలిసారి . ఈ వార్త తెలియగానే హుమాయిన్ ఆమెను విడిపించాడు . 1556 హుమాయిన్ మరణం బేగం ను తీవ్రంగా కుంగదీసింది . ఆయన స్మృతిగా నిర్మించిన ఈ సౌధం ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. .
Categories