Categories
ఉపవాసం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. పూర్వ కాలంలో జ్వరం వస్తే రెండు మూడు రోజుల పాటు తేలికైన జావ వంటివి ఆహారంగా ఇస్తూ ఒక రకంగా ఉపవాసం చేయించేవారని,అలా శరీరంలో ఘనాహారం పడిపోవటం తో శరీరం కొత్త స్టెమ్ సేల్స్ ను తయారు చేస్తుందని దీని వల్ల తెల్ల కణాల సృష్టి జరిగి రోగనిరోధక శక్తి అమితంగా పెరుగుతోందంటున్నారు. ఆ రకంగా జ్వరంగా ఉన్న మనిషిని వెంటనే కోలుకునే వాడిని అధ్యయన కారులు చెపుతున్నారు. వారం లో ఒక్క పూట ఐన ద్రవాహారం తీసుకొంటూ కానీ,లేదా నిరాహారంగా ఉండటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు నంటున్నారు.