Categories
జపాన్ లోని కళాకారులు వెదురుతో చాలా అందమైన కళాకృతులు తయారుచేస్తారు . జపాన్ లో ప్లాస్టిక్ వాడకం దాదాపు నిషేధం వాటి స్థానంలోకి వెదురుతో తయారుచేసే వస్తువుల్ని ముందుకు తీసుకువచ్చింది స్థానిక ప్రభుత్వం . వెదురుతో తయారు చేసే వస్తువులను కళాకృతులను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఎగ్జిబిషన్ తో పాటు అక్కడో మ్యూజియం కూడా ఉంది . వెదురుతో చేసే వస్తువులు ,ప్లాస్టిక్,ఇనుము,వంటి వాటితో సమానమైన అందంతో ఎంతో సృజనాత్మకంగా ఉంటాయి . అరుదైన నగిషీలతో అద్భుత కళా ప్రతిభకు నిదర్శనంగా కనిపించే వెదురు గ్వాడ్జెట్ ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులని చేసేస్తున్నాయి . ల్యాప్ టాప్ ,కీ బోర్డు మౌస్ ,కాలిక్యులేటర్ ,హెడ్ ఫోన్ ,స్పీకర్ ,పెన్ డ్రైవ్ కూడా వెదురుతో అద్భుతంగా తయారుచేస్తారు ఈ కళాకారులు .