భారతదేశంలో మహిళా చెస్ కు ముఖచిత్రంగా మారిపోయింది కోనేరు హంపి వందల సంఖ్యలో జాతీయ,అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకొని ,మొన్నీమధ్యనే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ కెయిన్స్ కప్ సాధించి ప్రపంచ చదరంగంలో రెండో స్థానంలో ఉంది హంపీ వివాహం అయి ,తల్లి అయ్యాక కూడా హంపీ కెరీర్ విషయంలో ఎలాటి మార్పులు రాలేదు . ఈ విషయం గురించి చెపుతూ ఏ రంగంలో నైనా మహిళలు అగ్రస్థానంలో రాణించాలంటే కుటుంబ సహకారం చాలా ముఖ్యం అంటోంది . చిన్నతనం నుంచి మా నాన్న కోనేరు ఆశోక్ దగ్గరే నాకొచింగ్ ,పెళ్ళయాక భర్త అన్వేష్ కుటుంబ సభ్యుల సహకారం ఉంది . ఎక్కడ ఒత్తిడి లేకుండా నా కుటుంబం నన్ను జాగ్రత్తగా చూసుకొంటారు . ప్రపంచంలోనే టాప్ క్రీడాకారిణిగా నిలవటం గొప్ప అనుభూతి అంటుంది హంపీ .