Categories
ఎప్పుడూ విశ్రాంతిగా ఉన్నా అది గొప్ప సంతోషాన్నివ్వదని తేలి పోయిన రోజులివి .లాక్ డౌన్ తో స్వీయ నిర్బంధం ఇలాంటి సమయంలో ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉండటం చాలా అవసరం దగ్గరే ఉంటూ దూరం పాటించాల్సిన సమయం. మనుషులు ఎదురుగా కనిపిస్తే పలకరింపుగా ఒక నవ్వు నవ్వితే మంచిదంటారు ఎక్స్ పర్డ్స్ .జనప్పల సంజ్ఞమనం సంతోషం మంచి భావాలతో ఉన్నాం అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం వంటిది .అలాగే నవ్వితే ముఖ కండరాలు మెదడును నేరుగా ప్రభావితం చేస్తాయి .ఎదుటి వారిని ప్రసన్నంగా నవ్వు మొహం తో చూసినప్పుడు ఎదురయ్యే అనుకూల ప్రతి స్పందన సంతోషాన్నిచ్చే మూడ్ మెరుగు పరుస్తుంది .దగ్గరగా వెళ్ళి కూర్చొని కబుర్లు చెప్పుకొనే సమయం వచ్చే వరకు చిరునవ్వుతో పలకరింపులే ఆనందాన్ని ఇస్తాయి .