Categories

ఫ్యాషన్ తో సంబంధం లేకుండా సాధారణంగా ఈ వేసవిలో తెల్లని దుస్తులనే ధరిస్తారు. ఇతర రంగులతో పోల్చితే తెలుపు రంగు కళ్ళకి చల్లగా అనిపిస్తుంది. తెలుపు ప్రశాంతత ఇచ్చే రంగు. మనసు వత్తిడిని తగ్గించుకోవాలంటే ఇంట్లో తెల్లని ( కర్రెన్స్దుప్పట్లు మార్చేయండి. అలాగే తెల్లని పండ్ల కూర గాయాలు ఎంచుకోండి. సూర్యకాంతి లో సప్తవర్ణాలు దాక్కుని ఉన్నట్లే తెల్లని పండ్ల కూరగాయల్లో పోషకాలు శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి తెల్లదనం భావోద్వేగాలని నియంత్రిస్తుంది. అందుకే ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు తెల్లని రంగు వేస్తారు. రోగులకు మనసు ప్రశాంతత కొసమె డాక్టర్లు,నర్సులు తెల్లని దుస్తులే ధరిస్తారు.