Categories
పిల్లల కోసం కెరీర్ బ్రేక్ చేసి ఉన్నా ఉద్యోగానికి గుడ్ బై చెప్పి కొత్తగా వ్యాపారం లోకి వచ్చిన ఎంతోమంది తల్లులు బిజినెస్ లో కూడా శభాష్ అనిపించు కొన్నారు .ఢిల్లీ ఐఐటి లో ఇంజనీరింగ్ చదివిన మీతా శర్మ గుప్తా హార్వర్డ్ లో పిహెచ్ డి చేసింది .ఉద్యోగ రీత్యా అమెరికా నుంచి ఇండియా వచ్చే సరకి ఆమె రెండో కొడుక్కి ఏడాది వయసు పెద్ద కొడుకు కలపతో సహజ వర్ణాలతో దొరికే బొమ్మలతో ఆడుకొనే వాడు .అలాంటి సురక్షితమైన బొమ్మలు మీతా శర్మకి దొరకలేదు .అవి వెతికే క్రమంలో ఆమె షమీ టాయ్స్ కంపెనీ పెట్టి పర్యావరణనికి ఏమాత్రం హాని చేయని పిల్లలు సురక్షితంగా ఆడుకొనే బొమ్మలు తయారు చేయటం ప్రారంభించింది .ఉద్యోగం మానేసి ఇప్పుడు వ్యాపార వేత్తగా స్థిరపడింది మీతా శర్మ .