ఈ రోజు నుండి వైశాఖ మాసం వచ్చేసింది.ఆధ్యాత్మికమైన,పవిత్రమైన,శక్తివంతమైన మాసం.దీనిని మాధవ మాసం అని కూడా అంటారు.
శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి ఈ మాసం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ మన తెలుగు నెలలు చైత్రము నుండి ఫాల్గునము వరకు తిథులు,వారాలు,నక్షత్రాల యొక్క ప్రాధాన్యత వివరించాడు. భక్తులు తెల్లవారుఝామునే నిద్ర లేచి సముద్ర,నది స్నానం చేస్తే మోక్షం కలుగుతుంది.శ్రీ మహావిష్ణువుకి,లక్ష్మీదేవికి కలిపి తులసి దళాలతో పూజలు నిర్వహిస్తారు.
శివుడికి ధారాపాత్రతో అభిషేకం చేయడం అత్యంత ప్రీతికరం.ఈ మాసం అన్ని శుభకార్యాలకు శుభాలు కలుగజేస్తుంది.సకల దేవతలకు వైశాఖ మాసంలో స్మరిస్తూ పూజలు చేసి ముక్తి పొందడానికి యోగ్యత.దానాలు,ధర్మాలు చేయటానికి శ్రేష్ఠమైనది.ఈ నెలలో పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉంది కావున వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం,పూజలు చేద్దాం.
శ్రీ మహావిష్ణవే నమః
నిత్య ప్రసాదం:కొబ్బరి, పులిహోర, పాయసం
-తోలేటి వెంకట శిరీష