ఒకప్పుడు భారత దేశంలో సంప్రదాయబద్ధమైన అందాలు ప్రామాణికాల ప్రకారం తెల్లని మేని ఛాయనే అందంగా పరిగణించేవారు. అయితే సౌందర్యం పట్ల భావనలు పూర్తిగా ఇవ్వాల్టికి మారిపోయాయి. సౌందర్య పరిశ్రమలోను విప్లవత్కమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న అంశం ప్రపంచంలోకి వచ్చింది. న్యాయంగా ఇది నా కాన్సెప్ట్. ఎలాటి మేకప్ లు,ప్రయోగాలు బ్రాండెడ్ దుస్తులు నాకెప్పుడు నచ్చలేదు. అత్యంత సహజంగా ఉండటం నాకెంతో ఇష్టం అంటోంది THAPPAD ధవుడె మూవీ లో నటించిన తాప్సీ పన్ను. అకారణంగా చేయి చేసుకున్న భర్త పై విడాకులు కోసం కేస్ దాఖలు చేసిన పాత్రలో తాప్సీ జీవించింది. శరీరం రంగు,కలతల కంటే ఆత్మభిమానం అనువైన అందం అంటోంది తాప్సీ.