ఎరువు సొమ్ము బరువు చేటు,తీయను పెట్టాను తీపుల చేటు,వాటిలో ఒకటి పోతే అప్పుల చేటు.
ఇలాటి సామెతలాన్ని అనుభవంతో చెప్పిన సూక్తులు. ఏ పెళ్ళికో పేరంటానికో వెళుతూ,సొంతంగా లేకపోయినా ఏ బంధువులవో,స్నేహితులవో నగలు పెట్టుకుపోతూ ఉంటే ఇంట్లో వుండే పెద్దవాళ్ళు,ఎందుకా ఎరువు సొమ్ములు,ఒకవేళ అవి గాని పోతే అనవసరంగా అప్పుల పాలై పోతాము,లేదా అనవసరపు గొప్పలకు పోవద్దు అని మందలించటమె ఈ సామెతగా మారి వుంటుంది.
‘ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు ‘ సామెత ఇంకా అద్భుతమైంది. మనుషులను మెప్పించి అవసరాలు గడుపుకొనేందుకు,ఎవరికి తగ్గ మాటలు వారికి చెపుతు,ఎవరేం చెప్పినా అది సరేనంటూ,ముఖప్రీతి మాటలు మాట్లాడే వాళ్ళను వెక్కిరిస్తూ వచ్చిన సామెత ఇది. మాట్లాడే మాటలకు సామెతలు జోడించి చెప్పటం ఒక చమత్కారం కూడా.
సేకరణ
సి.సుజాత