2014 లో దర్శకుడు,ఛాయాగ్రాహ దర్శకుడు అవినాష్ అరుణ్ మరాఠీలో నిర్మించిన అందమైన సినిమా కిల్లా (కోట). చదువుల్లో చురుగ్గ వుండే చినూ తండ్రి మరణిస్తాడు. తల్లి చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ స్థిరత్వం లేకుండ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ బదిలీలో పదకొండు సంవత్సరాలు చినూ ని వాళ్ళమ్మ కి ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. ఆలా వాళ్ళు పూణే నుంచి కొంకణీ తీరం లోని ఒక చిన్న ఉరికి బదిలీ అవుతారు చినూ నెమ్మదిగా అక్కడ కొందరు స్నేహితులు అవుతారు ఇంటి చుట్టు పక్కల దృశ్యాలు. సముద్రపు ఒడ్డున ఉండే కోట తో అనుబంధం ఏర్పడుతుంది. ఈ లోగ అమ్మకి ట్రాన్స్ ఫర్ . కోటని వదిలి వెళ్ళలేని బాధలో ఉన్న చినూ ఈ ట్రాన్స్ ఫర్ ల వత్తిడిలో ఉన్న తల్లి  మనసు ఎంతో బాగా అర్ధం అవుతోంది. ఈ సినిమాకు జాతీయ బహుమతు లతో పాటు బెర్లిన్ ఫెస్టివల్ ల్లో ప్రతిష్టాత్మిక అవార్డులు దక్కాయి. తప్పకుండా సినిమా చుడండి.

Leave a comment