సరైన దువ్వెన ఎంచుకోక పొతే జుట్టు ఊడిపోవడం, చిక్కులు పడటం తప్పదంటున్నారు హెయిర్ స్టైలిస్ట్ లు. దువ్వెన కొనే ముందే జుట్టు తత్వం ఎలాంటిది? పోదిబారినట్లు వుంటుందా? జిడ్డుగా వుంటుందా? రింగుల జుట్టా? సాదాగా మెత్తగా ఉంటుందా? అవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా వుండే పళ్ళ దువ్వెనని తక్కువ ఖరీదైనవి వడక పోవడం మేలు నన్యమైనవి ఎంచుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా పడిన చిక్కుల వల్ల జుట్టు తెగిపోకుండా వుంటుంది. జుట్టు పొదుపుగా వున్నప్పుడు దీర్ఘచతురస్రాకారంలో వుండే పెడల్ బ్రష్ ని ఉపయోగిస్తే మాడుకి రక్త ప్రసారణ సక్రమంగా జరుగుతుంది. జుట్టు అందులో చిక్కుకుని చిక్కులు పడకుండా వుంటుంది. జుట్టు అందులో చిక్కుకుని చిక్కులు పడకుండా వుంటుంది. అలాగే అండాకృతిలో క్విల్ బ్రష్ నూనె పెట్టుకున్నప్పుడు ఉపయోగించుకోవడం మంచిది. జుట్టు తత్వాన్ని బట్టి మంచి దువ్వెన ఎంపిక చేసుకుంటే జుట్టు చిక్కులు పడిపోకుండా వెంట్రుకలు రాలకుండా వుంటాయి.