Categories
నవ్వుకి నొప్పిని తగ్గించే లక్షణమే కాకుండా అలెర్జీల తీవ్రతను కూడా తగ్గించే లక్షణం ఉన్నట్లు ఎన్నో అంతర్జాతీయ క్లినికల్ పరీక్షలో రుజువైంది. మానసిక వైద్య నిపుణులు దీన్ని సీరియస్ గా అధ్యయనం చేసి నవ్వుల శాస్త్రానికే రూప కల్పన చేశారు దీన్నే గెటరాలజీ అంటారు. మానసిక వైద్య విధానంలో ఇదో ప్రత్యేక విభాగం దీని లోంచి లాఫ్టర్ యోగ పుట్టుకొచ్చాయి నవ్వితే మనసు తేలిక పడి దిగులు కుంగు బాటు వంటి మానసిక సమస్యలే కాదు ఎన్నో శారీరక సమస్యలు కూడా దూరం అవుతాయని పరిశోధికులు తేల్చారు. ఈ లాక్ డౌన్ ఉద్రిక్త సమయంలో మనసు తేలిక పడేలా చక్కని కామిక్ బుక్స్,నవ్వించే సినిమాలు,చూడండనీ నవ్వుతు కబుర్లు చెప్పుకోమని సూచిస్తున్నారు వైద్యులు.