ఈ రోజుల్లోనూ దెయ్యాలు , చేతబడులను  నమ్మేవాళ్ళు  ఉన్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు .ప్రపంచం లో చాలామంది నమ్ముతున్నారు ఈ దెయ్యాలను .మెక్సికో నగరంలో ఏకంగా మంత్రం విద్యలకు ఉపయోగించే వస్తువుల అమ్మే మార్కెట్ ఉంది దీని పేరు ‘సోనోరా మార్కెట్ ‘ఈ మార్కెట్ కు సెలవే ఉండదు  .స్థానికులే కాదు ఇతర దేశాల నుంచి ఈ మార్కెట్ కు వస్తూ ఉంటారు .ఈ మార్కెట్ లో మంత్రం తంత్రాలకు  ఉపయోగించే  వస్తువులు, మంత్రించిన పౌడర్లు, బలి ఇచ్చేందుకు కావలసిన వస్తువులు అమ్ముతారు .వాటిని ఎలా ఉపయోగించాలో వివరించి చెపుతారు .అదృష్టం ప్రేమ , డబ్బు, ఆరోగ్యం ఆశించే వాళ్ళు ఈ మార్కెట్ కు వస్తూ ఉంటారట .ఈ మంత్రం తంత్రాల మార్కెట్ ఇప్పుడు కూడా తెరిచే ఉంటుంది .

Leave a comment