రాబోయే రోజుల్లో ఆటోమేషన్,డిజిటైలైజేషన్,రోబోటిక్స్ డేటా (ఎనలప్స్) రంగాలు చాలా కీలకంగా ఉంటాయని ఎక్సపర్ట్స్ చెపుతున్నారు. కెరీర్ ను చక్కగా మలుచుకోవాలని ఆశించే స్త్రీలు ఇప్పుడా అవకాశాలన్నీ అందిపుచ్చుకోవచ్చు. కోవిడ్ కారణంగా ప్రతి అంశం ఇంట్లోంచే ఆన్ లైన్ లో చేయవలిసివస్తోంది.జూమ్ యాప్ ల వాడకం,ఆన్ లైన్ క్లాసులు హోంట్యూషన్ వంటివి చక్కగా నేర్చుకొంటే ఇంట్లోంచే ఎన్నో ఉద్యోగాలు చేయవచ్చు. విద్య,వైద్య సృజనాత్మిక రంగాల్లో ఉండే ఆడవాళ్ళు టెక్నాలజీ వాడకాన్ని నేర్చుకోవాలి. వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకొంటే ,ఈ లాక్ డౌన్ తర్వాత మారే జీవిత విధానం లో చక్కగా ఇమిడి పోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్.