తెలంగాణకు చెందిన భారతీయ-అమెరికన్ సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ర్టిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌కు జడ్జిగా నియమితులయ్యారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ, న్యాయవాద పట్టా తీసుకొన్న సరితా కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు పూర్తి చేసుకున్నారు.అమెరికా న్యాయవ్యవస్థ లోని పలు విభాగాల్లో పని చేశారు. ఆమె తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్ ,తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్.