Categories
పిల్లల పెంపకంలో తల్లి పాత్రతో పాటు టీచరు పాత్ర కూడా సమానంగా ఉంటుందని చెపుతున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం స్కూల్లో గడిపే పిల్లలు తమ తల్లితో ఉండే అనుబంధాన్ని టీచర్ తో కూడా పెంచుకొంటారట. ప్రైమరీ స్కూల్ దశలో,తల్లితండ్రులతో సరైన అనుబంధం లేని పిల్లలు ఆ లోటును టీచర్ తో సన్నిహితంగా ఉంటు భర్తీ చేసుకొంటారంటున్నారు. ప్రాధమిక స్థాయి దాటే వరకు పిల్లలతో ఇంట్లో తల్లులు స్కూల్ లో టీచర్లు ఇద్దరు చనువుగా,ప్రేమగా ఉంటె పిల్లల్లో ఎంతో మానసికాభివృద్దితో పాటు,వారిలో ఎక్కడ భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటారంటున్నారు.