ఉత్తరాఖండ్ కు చెందిన 82 సంవత్సరాల వయస్సు లో ఉన్న దర్శినీ దేవి భర్త భారత్ యుద్ధంలో హవల్దార్.1965 ఇండో పాక్ యుద్ధంలో వీర మరణం పొందారు. దర్శినీ దేవి దగ్గర దాచుకున్న డబ్బు రెండు లక్షల రూపాయల వరకు ఉంది.ఆ మొత్తాన్ని ఆమె సీ.ఎం కేర్ ఫండ్ కు ఇచ్చేశారు. డిఫెన్స్ స్టాప్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మనం దర్శినీ దేవి ని ఆదర్శంగా తీసుకోవాలి అలా చేయలేకపోయినా కనీసం చెల్లించవలసిన పన్నులైన సక్రమంగా చెల్లించాలి అన్నారు రావత్. దర్శినీ దేవి ఎంతో మందికి ఆదర్శం కావాలి.