Categories
తమిళనాడులో ముఖ్యంగా కారైకుడి, చిట్టినాడ్ ప్రాంతాల్లో తాటిచెట్ల సంఖ్య ఎంతో ఎక్కువ. అక్కడి హస్తకళా వస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం.తాటి ఆకులతో ఎన్నో అందమైన వస్తువులను తయారుచేస్తారు. దీన్ని కొట్టాన్ కళ అంటారు. పెళ్లిళ్లలో తెచ్చే చీరలూ మిఠాయిలూ సారెలో వాటిని ఉంచే బాక్సులూ ట్రేలూ మొదలైనవి అన్ని తాటాకుతోనే అల్లుతారు. వర్షాకాలపు గొడుగులు దగ్గర నుంచి పిల్లలు ఆడుకొనే గిలక్కాయలూ బ్యాగ్ లు పూలదండలు. ఇలా తాటితో అల్లిక లెన్నో ఉన్నాయి. లేత తాటాకును సన్నగా చీల్చి రంగునీళ్లలో ఉడికించి ఆరబెట్టి ఎంతో సరికొత్త డిజైన్ లతో అందమైన వస్తువులు అల్లుతున్నారు. పర్యావరణ ప్రేమికులు వీటిని ఎంతో ఇష్టంతో కొంటున్నారు.