Categories
ఇంటి బాల్కనీ.చిన్న మొక్కలు పెంచుకునేలా తయారై వచ్చాయి టెర్రా ప్లాంటర్ లు .పూర్తిగా ఎర్ర మట్టితో చేసిన ఈ ప్లాంటర్ చూసేందుకు కూజా లా ఉంటుంది. దీనికి జనపనార వస్త్రం అంటిస్తారు. ప్లాంటర్ లో నీళ్ళు పోస్తే దానికి ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీళ్లు పీల్చుకొంటుంది. ఈ జనపనార వస్త్రానికి చిన్న మొక్కల కోసం విత్తనాలు అంటిస్తే అవి చెమ్మను పీల్చుకుంటూ చక్కగా ఎదుగుతాయి. ఈ ప్లాంటర్ లు ఇంట్లో ఎక్కడ పెట్టినా బావుంటాయి. ఈ విధానంలో మొక్కలు వాటికి కావలసిన నీళ్లు మాత్రమే తీసుకోవటం వల్ల ఎప్పుడూ నీటి లభ్యత ఉండటం వల్ల ఆరోగ్యంగా పెరుగుతాయి.