Categories
సన్నబడాలంటే వ్యాయామాలు ఆహార నియమాలు తప్పనిసరి కానీ ఎదురుగా తీయని పదార్థాలు ఊరిస్తూ ఉంటాయి.ఈ కరోనా భయాలు లాక్ డాన్ ఒత్తిడిలో నోట్లో తియ్యగా ఏదైనా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది.శరీరం బరువు పెరుగుతుంది అని భయం వేస్తోంది. అలాంటప్పుడు నేతి మిఠాయిలు జోలికి పోకుండా కిస్ మిస్,ఖర్జూరాలు, అంజూర, వంటివి తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .లేదా ఒక చిన్న బెల్లం ముక్క తినచ్చు.వీటిలో కేలరీలు మాత్రమే కాదు మినరల్స్, ప్రోటీన్స్ ,ఖనిజాలు, పీచు, వంటివి ఉంటాయి.బెల్లం తో బాదం, వేరుశెనగ, జీడిపప్పు, ఓ గుప్పెడు తిన్న పర్లేదు.ఓట్స్ ను జావలా కాచి అందులో పండ్ల ముక్కలు డ్రై ఫ్రూట్స్ ఎలుకలు వేసుకోవచ్చు ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం తక్కువే.