Categories
ఎండ వేడికి చర్మం కమిలిపోవడం చెమట వల్ల జిడ్డుగ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ట్యాన్, మొటిమలు సమస్య వస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ రసం స్వాంతన ఇస్తుంది. పుచ్చకాయ రసం మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఒక టీ స్పూన్ బార్లీ పొడి లో ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఆరిపోయాక శుభ్రం చేస్తే ఎండదెబ్బకు కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది.