Categories
లాక్ డౌన్ సమయంలో పిల్లల కోసం రోగనిరోధక శక్తి పెరిగే ఆహారం ఇమంటున్నారు పోషకాహార నిపుణులు పిల్లల కోసం అధికశాతం ప్రోటీన్స్ ఉండే చికెన్, మటన్, చేపలు ఇవ్వాలి కణజాలాల్ని మరమ్మతు చేసుకోవటంలో తెల్ల కణాలు పెరగటం లో ప్రొటీన్లు సాయం చేస్తాయి మాంసం కృతుల్లో విటమిన్ బి ,జింక్, ఐరన్, అధికంగా ఉంటాయి.చిన్నారుల పేగులను యోగర్ట్ బలోపేతం చేస్తుంది.దీనిలోని ప్రోబయోటిక్స్ చెడు బ్యాక్టీరియాతో పోరాడుతాయి.నట్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ లుగా యాంటీ ఆక్సిడెంట్స్ గా ఉపకరిస్తాయి,క్యాబేజీ, బ్రకోలీ పాలకూర లో టమోటాల్లో అనేక పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలోని బీటా-కెరోటిన్, ఇతర కెరోటినాయిడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి .