Categories

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.తేమ అందినప్పుడే చర్మం తాజాగా ఉంటుంది.స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి కలబంద గుజ్జు, తేనె, ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని నీళ్లతో కడిగేసుకుంటే కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది.టమాటో లో ఉండే లైకోపిన్ చర్మాన్ని పొడిబార నివ్వదు.టమోటో గుజ్జులో పాల పొడి, ఓట్స్ పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ లాగా వేసుకొని కొంచెం ఆరాక మసాజ్ చేసినట్లు మెత్తగా రుద్దితే మృతకణాలు పోతాయి చర్మం కాంతిగా ఉంటుంది.